గాడి తప్పిన రేవంత్ పాలన
బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాకేష్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన రేవంత్ రెడ్డి సర్కార్ పై మండిపడ్డారు. మంగళవారం సచివాలయానికి వెళ్లారు. అక్కడ గోడకు జీవో 46కు సంబంధించిన వినతి పత్రాన్ని అంటించి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఇప్పటి దాకా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాలన పడ కేసిందని అనుకున్నామని కానీ అది అట కెక్కిందని ఇప్పుడే తెలిసిందన్నారు . ఈ ప్రభుత్వానికి పీఆర్ స్టంట్ల మీద ఉన్న సోయి.. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో లేదని ఆరోపించారు రాకేష్ రెడ్డి.
ఓ వైపు ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, గురుకుల టీచర్లు ఆందోళన చేస్తుంటే ఇసుమంత సోయి రేవంత్ రెడ్డికి ఉండడం లేదన్నారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే పట్టించకోక పోవడం దారుణమన్నారు రాకేశ్ రెడ్డి.
గత కొంత కాలంగా జీవో 46 బాధితులను పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 60 మార్కులు వచ్చిన వారికి జాబ్స్ వచ్చాయని కానీ 90 మార్కులు వచ్చిన వాళ్లకు రాలేదని ఇలాంటి చరిత్ర ఒక్క తెలంగాణలోనే ఉందన్నారు .