NEWSTELANGANA

జర్నలిస్టుల కోసం నూతన విధానం

Share it with your family & friends

మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి

న‌ల్ల‌గొండ జిల్లా – తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మ‌న్ కె . శ్రీ‌నివాస్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం త్వరలో నూతన విధానం రూపొందిస్తున్నామని చెప్పారు. మంగళవారం ఖమ్మంలో జరుగుతున్న టి యు డబ్ల్యూ జే ,ఐజేయు రాష్ట్ర మహాసభలకు వెళుతున్న సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, ఐజే యు జాతీయ కార్యవర్గ సభ్యులు కొణిజేటి సత్యనారాయణ లను సూర్యాపేట జర్నలిస్టులు పూల బొకేలు, శాలువాలతో సన్మానిం చారు.

ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన ఇల్లు, ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ సమస్యలు పరిష్కారం అవుతాయని జర్నలిస్టులలో ఒక రకమైన నమ్మకం, విశ్వాసం ఏర్పడ్డాయని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి శాసనసభ వ్యవహారాలు, ఓటు ఆన్ అకౌంట్, తదుపరి లోక్సభ ఎలక్షన్లు వరుసగా రావడంతో పరిపాలనపై దృష్టి కేంద్రీకరించే విషయం కొంత ఆలస్యమైందని తెలిపారు.

అయితే రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో చర్చించడం జరిగిందని అన్నారు.
. హెల్త్ కార్డుల విషయంలో ఏర్పడ్డ సమస్యలన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో 24 వేల అక్రిడిటేషన్లు కలిగి ఉన్నామని వివరించారు.

అనర్హులకు అక్రిడిటేషన్లు అందకుండా ఒక క్రీమ్ లైన్ ఏర్పాటు చేస్తామని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు తప్పకుండా అక్రిడిటేషన్ వచ్చేలా చేస్తామని చెప్పారు.