రెచ్చి పోయిన అయ్యన్న
అధికారులపై బూతులు
అమరావతి – మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు రెచ్చి పోయారు. మున్సిపల్ అధికారులపై అనరాని మాటలు అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
మంగళవారం ఈ ఘటన అనకాపల్లి నర్సీపట్నం లో చోటు చేసుకుంది. మున్సిపల్ అధికారులపై బండ బూతులు మాట్లాడారు. చెప్పరాని భాషలో తిట్ల దండకం మొదలు పెట్టారు అయ్యన్న పాత్రుడు. తమాషాలు చేస్తున్నారా అంటూ బెదిరించడం విస్తు పోయేలా చేసింది.
కళ్లు మూసుకు పోయాయా అంటూ ఫైర్ అయ్యారు. ఇష్టం లేక పోతే ఇక్కడి నుంచి వెళ్లి పోవాలని హుకూం జారీ చేశారు. అంతే కాదు తాను త్వరలోనే స్పీకర్ అవుతానని, మిమ్మల్ని అసెంబ్లీలో గంటల కొద్దీ నిలబెట్టక పోతే తన పేరు మార్చుకుంటానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చి కొన్ని రోజులు కాక ముందే మాజీ మంత్రి ఇలా రెచ్చి పోవడం ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసేలా చేస్తోంది.