NEWSANDHRA PRADESH

నాదెండ్ల స‌మీక్ష శాఖ‌పై ఆరా

Share it with your family & friends

తూనిక‌లు, కొల‌త‌ల శాఖ‌పై స‌మీక్ష

అమ‌రావ‌తి – ఏపీలో ప్ర‌భుత్వం మార‌డంతో కొత్త‌గా కొలువు తీరిన మంత్రులు త‌మ శాఖ‌ల‌పై ప‌ట్టు సాధించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల చైర్మ‌న్ గా అపార‌మైన అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు నాదెండ్ల మ‌నోహ‌ర్. ఆయ‌న గ‌తంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి స్పీక‌ర్ గా కూడా ప‌ని చేశారు. మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇదిలా ఉండ‌గా ఈసారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో అనూహ్యంగా జ‌నసేన‌, టీడీపీ, బీజేపీ కూట‌మి ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. త‌మ నాయ‌కుడు డిప్యూటీ సీఎంగా ఇవాళ కొలువు తీరారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర తూనిక‌లు, కొల‌త‌ల శాఖ మంత్రిగా కొలువు తీరారు ఇప్ప‌టికే మ‌నోహ‌ర్. బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం దూకుడు పెంచారు.

ఈ మేర‌కు మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లోని ప్ర‌ధాన కార్యాల‌యంలో స‌మీక్ష చేప‌ట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా తూనిక‌లు, కొల‌త‌ల‌కు సంబంధించి ఆరా తీయాల‌ని ఆదేశించారు. ఎక్క‌డ కూడా అక్ర‌మాలు చోటు చేసుకునేందుకు వీలు లేద‌న్నారు.