సీఎంతో డిప్యూటీ సీఎం భేటీ
సచివాలయానికి జనసేనాని
అమరావతి – జనసేన పార్టీ చీఫ్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం సచివాలయానికి విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన అక్కడే ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లారు. ఆయనను అభినందించారు. ఇద్దరూ కలిసి కొద్ది సేపు చర్చించారు.
ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను ఆలింగనం చేసుకున్నారు. సాదరంగా స్వాగతం పలకడం విస్తు పోయేలా చేసింది. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఇవాళ సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ కు వచ్చారు.
మరో వైపు మంత్రులు నాదెండ్ల మనోహర్ , కందుల దుర్గేష్ సీఎంను కలిశారు. అనంతరం జనసేన చీఫ్ తో చర్చించారు. ఈ ఇద్దరూ జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ 21 శాసన సభా స్థానాలతో పాటు 2 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీకి చెందిన సత్య కుమార్ యాదవ్ కు కేబినెట్ లో చోటు దక్కింది.