మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు
బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరింది కేబినెట్. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు మరో 23 మంది కేబినెట్ లో చోటు దక్కించుకున్న మంత్రులు సంతకాలు చేశారు.
ఈ సందర్బంగా సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. వీరిద్దరి మధ్య కొంత సేపు చర్చలు జరిగాయి. ఇదిలా ఉండగా తనకు కేటాయించిన చాంబర్ ను పరిశీలించారు పవన్ కళ్యాణ్.
కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులకు సచివాలయంలో ఛాంబర్లను కేటాయించారు. రెండో బ్లాక్ లో ఏడుగురు మంత్రులకు చాంబర్లను కేటాయించగా మూడో బ్లాక్ లో ఐదుగురు మంత్రులకు అప్పగించారు. నాలుగో బ్లాక్ లో 8 మంది మంత్రులకు, ఐదో బ్లాక్ లో నలుగురు మంత్రులకు ఛాంబర్లను కేటాయించారు.
ఇక పవన్ కళ్యాణ్ కు రెండో బ్లాక్ ను కేటాయించారు. మొదటి అంతస్తులో ఉన్న 211 రూమ్ నంబర్ ను అలాట్ చేశారు. అయితే జనసేన పార్టీకి చెందిన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు కూడా పవన్ కు పక్కనే చాంబర్లు కేటాయించడం విశేషం.