వయో వృద్ధుల ప్రత్యేక ప్రవేశ దర్శనం
ఆన్లైన్ కో టామూడు నెలల ముందే
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు టీటీడీకి సంబంధించి నిరాధార వార్తలను నమ్మ వద్దని కోరింది. అధికారిక టీటీడీ పోర్టల్ ద్వారా ఏదైనా సమాచారాన్ని నివృత్తి చేసుకోవాలని సూచించింది.
ఇక వయో వృద్దులకు సంబంధించి తీపి కబురు చెప్పింది. వీరి దర్శనానికి సంబంధించి సామాజిక మాధ్యమాలలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయని తెలిపింది. ఇది నిజం కాదని పేర్కొంది.
ప్రతిరోజు 1000 మంది వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం టిటిడి ప్రతి నెలా 23 మధ్యాహ్నం 3 గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్ లైన్ కోటాను విడుదల చేస్తోందని తెలిపింది టీటీడీ.
ప్రస్తుతం ఆన్లైన్ టిక్కెట్లు ఆగస్టు 2024 వరకు బుక్ చేసుకున్నారని, టికెట్ పొందిన వ్యక్తికి రూ.50/- ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుందని పేర్కొంది.తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపింది.
.భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.