NEWSTELANGANA

విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ తీస్తే స‌హించం

Share it with your family & friends

మంత్రి జూప‌ల్లి కృష్ణా రావు షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ – రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు నిప్పులు చెరిగారు. ఆయ‌న త‌న స్వంత శాఖ అధికారుల‌పై చిందులు వేశారు. ప్ర‌భుత్వానికి తెలియ‌కుండా స్వంత నిర్ణ‌యాలు ఎలా తీసుకుంటారంటూ ప్ర‌శ్నించారు.

ఎక్సైజ్ శాఖ‌పై స‌మీక్షించిన మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. బేవ‌రేజ్ కార్పోరేష‌న్ త‌ప్పుడు నిర్ణ‌యాల వ‌ల్ల ప్ర‌భుత్వానికి, ఎక్సైజ్ శాఖకు చెడ్డ‌పేరు వ‌స్తోంద‌న్నారు. కీల‌క‌మైన బాధ్య‌తల్లో ఉన్న‌వారు ప్ర‌భుత్వం ఇచ్చే ఆదేశాల‌కు అనుగుణంగా న‌డుచు కోవాల‌ని సూచించారు.

స్వంత నిర్ణ‌యాల వ‌ల్ల ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్ప‌డుతుంద‌న్నారు మంత్రి జూప‌ల్లి. దీని కార‌ణంగా ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళతాయ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వ దృష్టికి తీసుకు రాకుండా కంప‌నీల విధి విధానాల‌ను ఎలా ఖ‌రారు చేస్తారంటూ ప్ర‌శ్నించారు.

ఏ నిబంధ‌న‌ల ప్ర‌కారం నిర్ణ‌యం తీసుకున్నారంటూ మండిప‌డ్డారు. విచార‌ణ జ‌రిపి వెంట‌నే నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఎక్సైజ్ శాఖ క‌మిష‌న‌ర్ ను ఆదేశించారు జూప‌ల్లి.