ప్రజా నాయకుడా వర్దిళ్లు
జూన్ 19న గాంధీ పుట్టిన రోజు
న్యూఢిల్లీ – కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పుట్టిన రోజు ఇవాళ. ఆయన జూన్ 19, 1970లో పుట్టారు. ఇప్పుడు రాహుల్ వయసు 54 ఏళ్లు. విద్యాధికుడైన రాహుల్ గాంధీ ఇవాళ మోస్ట్ పాపులర్ లీడర్ గా గుర్తింపు పొందారు. అంతకు ముందు ఆయన ఎన్నో సవాళ్లను, ఆటు పోట్లను ఎదుర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీ పరివారాన్ని ధీటుగా ప్రతిఘటించారు.
ఏఐసీసీ చీఫ్ గా 2019లో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోరమైన ఓటమిని చవి చూసింది. దీంతో తనకు పదవి వద్దంటూ రాజీనామా చేశారు. కొంత కాలం పాటు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి నేటి దాకా వెనుదిరిగి చూడలేదు.
ఈ దేశానికి ద్వేషం కాదు ప్రేమ కావాలి అనే నినాదంతో ముందుకు వెళ్లాడు. ఎవరూ ఊహించని రీతిలో భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఇది దేశాన్ని కదిలించేలా చేసింది. తాజాగా 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యమైన రీతిలో విజయాన్ని సాధించింది కాంగ్రెస్ పార్టీ. మిత్రపక్షాలతో కలిసి బరిలోకి అధికారం అంచుల దాకా తీసుకు వెళ్లడంలో రాహుల్ గాంధీ పోషించిన పాత్ర విస్మరించ లేదు.
దేశం బాగు పడాలంటే కులం, మతం, ప్రాంతాల పేరుతో విద్వేషాలను రెచ్చ గొట్టడం కాదని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ నిజమైన జన నాయకుడిగా గుర్తింపు పొందారు. హ్యాపీ బర్త్ డే రాహుల్ సర్.