NEWSNATIONAL

నెట్టింట్లో ప్రియాంక హ‌ల్ చ‌ల్

Share it with your family & friends

వ‌య‌నాడులో అపూర్వ ఆద‌ర‌ణ

కేర‌ళ – కాంగ్రెస్ పార్టీలో కీల‌క‌మైన నాయ‌కురాలిగా గుర్తింపు పొందిన ప్రియాంక గాంధీ ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ గా మారారు. త‌ను త‌న సోద‌రుడు గెలుపొందిన కేర‌ళ లోని వయ‌నాడు నుంచి బ‌రిలోకి దిగారు. తాజాగా దేశ వ్యాప్తంగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌న సోద‌రుడు , మాజీ ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీ చేశారు. కేర‌ళ లోని వ‌య‌నాడు నుంచి ఆయ‌న సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇదే స‌మ‌యంలో ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని రాయ్ బ‌రేలి లోక్ స‌భ స్థానం నుంచి పోటీ చేసి భారీ విజ‌యాన్ని న‌మోదు చేశారు.

దీంతో పార్టీతో పాటు దేశ వ్యాప్తంగా ఉత్కంఠ‌ను రేపింది రాహుల్ గాంధీ ఏ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకుంటారు..దేనిని వ‌దులుకుంటార‌ని . కానీ ఊహించ‌ని రీతిలో త‌న‌ను ఆద‌రించి, అక్కున చేర్చుకున్న వయ‌నాడును రాహుల్ వ‌దిలేసుకున్నారు. ఇదే స‌మ‌యంలో త‌న త‌ల్లిని ఆద‌రించి, ఆశీర్వ‌దించిన రాయ్ బ‌రేలిని ఎంచుకున్నారు.

దీంతో వ‌య‌నాడు నుంచి త‌న సోద‌రి ప్రియాంక గాంధీని బ‌రిలోకి దించారు. దీంతో ప్ర‌జ‌లు కూడా రాహుల్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించారు. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ప్రియాంక గాంధీకి సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.