NEWSNATIONAL

త‌మ్ముడు రాహుల్ కు శుభాకాంక్ష‌లు

Share it with your family & friends

సోదరుడంటూ సీఎం స్టాలిన్ గ్రీటింగ్స్

త‌మిళ‌నాడు – రాష్ట్ర ముఖ్య‌మంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి సోద‌రుడంటూ పిలిచారు. జూన్ 19న రాహుల్ గాంధీ పుట్టిన రోజు. ఇవాల్టితో ఆయ‌న‌కు 54 ఏళ్లు.

రాహుల్ గాంధీ ప‌ట్ల త‌న‌కు ఉన్న వాత్సల్యాన్ని ఈ సంద‌ర్బంగా పంచుకున్నారు ఎంకే స్టాలిన్. ట్విట్ట‌ర్ వేదిక‌గా బుధవారం స్పందించారు. తాను ఎంతో మంది రాజ‌కీయ నాయ‌కుల‌ను చూశాన‌ని, కానీ రాహుల్ గాంధీ లాంటి నాయ‌కుడిని చూడ‌లేద‌ని ప్ర‌శంసించారు.

రాహుల్ గాంధీకి మంచి భ‌విష్య‌త్తు ఉంద‌న్నారు. తాను దేశం కోసం పున‌రంకిత‌మైన విధానం త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకునేలా చేసింద‌న్నారు. దేశ చ‌రిత్ర గ‌తిని మార్చేసిన స‌న్నివేశం భార‌త్ జోడో యాత్ర అని పేర్కొన్నారు.

ఈ యాత్ర‌ను త‌మిళ‌నాడు నుంచే ప్రారంభించ‌డం , అది భారీ స‌క్సెస్ సాధించ‌డం తాను మ‌రిచి పోలేనంటూ తెలిపారు సీఎం ఎంకే స్టాలిన్. రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు చ‌ల్లంగా ఉండాల‌ని కోరారు.