NEWSNATIONAL

రాహుల్ కు రేవంత్ బ‌ర్త్ డే విషెస్

Share it with your family & friends

దేశానికి ద్వేషం కాదు ప్రేమ కావాలి

హైద‌రాబాద్ – ఏఐసీసీ మాజీ చీఫ్ , రాయ్ బ‌రేలి ఎంపీ రాహుల్ గాంధీ పుట్టిన రోజు ఇవాళ‌. దీంతో దేశ వ్యాప్తంగా రాజ‌కీయ‌, క్రీడా, సినిమా, వ్యాపార‌, వాణిజ్య రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ చేస్తున్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా అభినంద‌న‌ల వెల్లువ కొన‌సాగుతోంది.

తాజాగా త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ అయితే ఏకంగా త‌న ఆత్మీయ సోద‌రుడు రాహుల్ గాంధీ అంటూ సంబోధించారు. ఇక టీపీసీసీ చీఫ్‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంతి ఎనుముల రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

ఈ దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ అంటూ కొత్త అర్థం చెప్పిన అరుదైన నాయ‌కుడు త‌మ నేత అంటూ పేర్కొన్నారు. గ‌త కొంత కాలం నుంచి ఒంట‌రిగా ఆయ‌న సాగించిన పోరాటం గురించి ఎంత చెప్పినా త‌క్కువేనంటూ తెలిపారు.

పేద‌లు, బ‌డుగులు, బ‌హుజ‌నులు, మైనార్టీల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ ప‌డుతున్న త‌ప‌న గొప్ప‌ద‌న్నారు. ఆయ‌న చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర దేశ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచి పోతుంద‌న్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.