NEWSANDHRA PRADESH

డిప్యూటీ సీఎంగా కొలువు తీరిన ప‌వ‌న్

Share it with your family & friends

ప్ర‌జా ప్ర‌తినిధిగా తొలిసారిగా సెక్ర‌టేరియేట్ కు

అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ చీఫ్ , డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ బుధ‌వారం అధికారికంగా అమ‌రావ‌తి లోని స‌చివాల‌యానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్బంగా త‌న ఛాంబ‌ర్ లోకి వెళ్లారు. అక్క‌డ ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అనంత‌రం కీల‌క ఫైల్ పై సంత‌కం చేశారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు స‌చివాల‌యంలోని 2వ బ్లాకును కేటాయించింది. ఇందులో 211వ నంబ‌ర్ ఛాంబ‌ర్ లో ఆసీనుల‌య్యారు డిప్యూటీ సీఎం. ఆయ‌న‌తో పాటు జ‌న‌సేన పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఏపీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్, కందుల దుర్గేష్ కు ప‌క్క ప‌క్క‌నే ఛాంబ‌ర్ల‌ను కేటాయించింది స‌ర్కార్.

ఇదిలా ఉండ‌గా గత ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెక్క విప్పిన రెవెల్యూష‌న‌రీ లాగా , ఫీనిక్స్ ప‌క్షి లాగా తిరిగి త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు. అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసి ఏపీలో ప్ర‌భుత్వం ఏర్పాటు అయ్యేలా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.