NEWSNATIONAL

ఓడించిన అభ్య‌ర్థికి కంగ్రాట్స్

Share it with your family & friends

మాజీ సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్

ఒడిశా – ఒడిశా శాస‌న స‌భ‌లో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. మాజీ ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు. ఎందుకంటే ఆయ‌నకు మ‌చ్చ లేని నాయ‌కుడిగా గుర్తింపు ఉంది. కానీ తాజాగా 2024లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. న‌వీన్ ఏకంగా 24 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం సీఎంగా కొన‌సాగారు. అన్ని రంగాల‌లో ఒడిశాను ముందుంచే ప్ర‌య‌త్నం చేశారు.

కానీ ప్ర‌జ‌లు మార్పు కోరుకున్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప‌ట్టం క‌ట్టారు. ఒడిశా సీఎంగా అత్యంత పిన్న వ‌య‌సు క‌లిగిన మాఝీని ఎన్నుకున్నారు. ఇత‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి అత్యంత కావాల్సిన వ్య‌క్తం. న‌మ్మ‌కమైన నాయ‌కుడిగా పార్టీని విజ‌య‌వంతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డంలో పేరు పొందాడు.

కొత్త‌గా కొలువు తీరిన స‌భ‌లో న‌వీన్ ప‌ట్నాయ‌క్ తాను ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను ఓడించిన బీజేపీ అభ్య‌ర్థి ల‌క్ష్మ‌ణ్ ను ప‌రిచ‌యం చేసుకున్నారు. నువ్వేనా న‌న్ను ఓడించిందంటూనే అత‌డిని అభినందించారు.

దీంతో సీఎంతో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు లేచి నిల‌బ‌డి న‌వీన్ ప‌ట్నాయ‌క్ కు అభివాదం చేయ‌డం విశేషం.