అరుణాచలానికి స్పెషల్ బస్సు
ప్రకటించిన అవనిగడ్డ డిపో మేనేజర్
అమరావతి – కోట్లాది మంది భక్తులు నిత్యం కొలిచే దేవుడు తమిళనాడులో ఉన్న అరుణాచలంలోని శివుడు. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసుకుంటే సకల సమస్యలు తీరి పోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం..విశ్వాసం కూడా.
ఆనాటి శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన ఈ ఆలయం నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇక్కడ శివుడిని భక్తి పారవశ్యంతో కొలుస్తారు. ఇక ప్రతి పౌర్ణమిని పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు అరుణాచలానికి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.
పలు రాష్ట్రాల నుండి బస్సులు, ట్రైన్లు ఈ పుణ్య క్షేత్రానికి వెళుతున్నాయి. తాజాగా ఏపీలోని అవనిగడ్డ నుంచి కూడా అరుణాచలంకు ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు డిపో మేనేజర్ హనుమంత రావు.
ఈ బస్సు అవనిగడ్డ నుండి గురువారం ఉదయం 20 సాయంత్రం 5 గంటలకు బయలు దేరుతుందని తెలిపారు. బస్సులో సీట్లు కావాల్సిన ప్రయాణీకులు రిజర్వేషన్ చేయించు కోవాలని కోరారు. భక్తులు వివరాల కోసం 995922 5466, 7382 899 427,7036335079 నెంబర్లను సంప్రదించాలని సూచించారు .