NEWSNATIONAL

ప్రియాంక గ్రీటింగ్స్ రాహుల్ కంగ్రాట్స్

Share it with your family & friends

బ‌ర్త్ డే విషెస్ చెప్పిన సోద‌రి గాంధీ

న్యూఢిల్లీ – కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ పుట్టిన రోజు ఇవాళ‌. ఆయ‌న జూన్ 19 , 1970లో పుట్టారు. సోద‌రి ప్రియాంక గాంధీతో పాటు త‌ల్లి సోనియా గాంధీ, బావ మ‌రిది రాబ‌ర్ట్ వ‌దేరా, ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే , ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణు గోపాల్ , ఎంపీ శ‌శి థ‌రూర్ , సీఎంలు ఎనుముల రేవంత్ రెడ్డి, డీకే శివ కుమార్ , త‌దిత‌ర సీనియ‌ర్ నాయ‌కులు రాహుల్ గాంధీకి బ‌ర్త్ డే విషెస్ తెలిపారు.

బుధ‌వారం సోద‌రి ప్రియాంక గాంధీ త‌న సోద‌రుడు రాహుల్ గాంధీకి స్పెష‌ల్ గ్రీటింగ్స్ తెలిపారు. ఇలాంటి రోజులు మ‌ళ్లీ మ‌ళ్లీ రావాల‌ని కోరారు. నీవు త‌న అన్న‌వైనందుకు త‌న‌కు సంతోషంగా ఉంద‌ని పేర్కొన్నారు. నీపై ల‌క్ష‌లాది మంది జ‌నం ఆశ‌లు పెట్టుకున్నార‌ని, వారి క‌ల‌ల‌ను నెర‌వేర్చేందుకు ఇలాగే క‌ష్ట ప‌డ‌తావ‌ని ఆ న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని పేర్కొన్నారు ప్రియాంక గాంధీ.

ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ చ‌రిత్ర సృష్టించారు. భార‌త దేశంలో ఆయ‌న వేల కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేప‌ట్టారు . దేశానికి కావాల్సింది ద్వేషం కాద‌ని ప్రేమ కావాలంటూ పిలుపునిచ్చారు . ఆయ‌న ప్ర‌య‌త్నం ఫ‌లించింది. కాంగ్రెస్ కు భారీ ఎత్తున సీట్లు వ‌చ్చేలా చేసింది.