సింహ వాహనంపై వేంకటేశ్వరుడు
యోగ నరసింహ స్వామి అలంకారం
తిరుపతి – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భావించే తిరుపతి పరిధిలోని అప్పలాయగుంటలో వెలసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
ఉత్సవాలలో భాగంగా సింహ వాహనంపై యోగ నరసింహ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి అభయం ఇచ్చారు భక్త బాంధవులకు.
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం ఉదయం 8 గంటలకు స్వామి వారు శ్రీ యోగ నరసింహస్వామి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. సాయంత్రం 5.30 నుండి 6:30 గంటల వరకు ఊంజల సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై స్వామి వారు విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు.
స్వామి వారి వాహన సేవలో ఏఈవో రమేష్, సూపరింటెండెంట్ వాణి, కంకణ భట్టర్ సూర్య కుమార్ ఆచార్యులు,టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ పాల్గొన్నారు.