అత్యున్నత విద్యకు నలంద కేరాఫ్
స్పష్టం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
బీహార్ – అత్యున్నతమైన, నాణ్యమైన విద్యకు కేరాఫ్ నలంద విశ్వ విద్యాలయం అని కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బుధవారం యూనివర్శిటీలో అత్యాధునిక వసతులతో నిర్మించిన క్యాంపస్ ను ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు నరేంద్ర మోడీ.
క్యాంపస్ ఎందరికో స్పూర్తిగా నిలుస్తుందన్నారు. పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ప్రధానమంత్రి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
తాము కొలువుతీరిన తర్వాత విద్యా రంగంలో పెను మార్పులు తీసుకు రావడం జరిగిందని చెప్పారు నరేంద్ర మోడీ. గతంలో విద్యా రంగాన్ని కొంత మందికి మాత్రమే చెందేలా ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ తాను ముచ్చటగా మూడోసారి పీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం యూనివర్శిటీ క్యాంపస్ ను ప్రారంభించడం సంతోషాన్ని కలిగించేలా చేసిందన్నారు పీఎం.