NEWSANDHRA PRADESH

జ‌న సేనానికి నాదెండ్ల కంగ్రాట్స్

Share it with your family & friends

ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాలి

అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ చీఫ్ , పిఠాపురం ఎమ్మెల్యే ప‌వ‌న్ క‌ళ్యాణ్ బుధ‌వారం రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. స‌చివాల‌యంలోని 2వ బ్లాక్ లో కొలువు తీరారు. ఆయ‌న‌కు ప్ర‌భుత్వం 211వ ఛాంబ‌ర్ ను కేటాయించింది.

అంత‌కు ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు స్వాగతం ప‌లికారు. అక్క‌డి నుంచి నేరుగా సెక్ర‌టేరియ‌ట్ కు చేరుకుని సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. అనంత‌రం త‌న‌కు కేటాయించిన సీటులో కూర్చున్నారు. డిప్యూటీ సీఎంగా సంత‌కం చేశారు.

ఈ సంద‌ర్బంగా త‌న ప‌క్క‌నే త‌న పార్టీకి చెందిన నాదెండ్ల మ‌నోహ‌ర్, కందుల దుర్గేష్ లకు స‌ర్కార్ గ‌దులు కేటాయించింది. త‌మ నాయ‌కుడు డిప్యూటీ సీఎంగా కొలువు తీర‌డంతో సంతోషానికి లోన‌య్యారు మ‌నోహ‌ర్, దుర్గేష్.

పుష్ప గుచ్చాలు ఇచ్చి ఆత్మీ ఆలింగ‌నం చేసుకున్నారు మ‌నోహ‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను. రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సినిమాటోగ్ర‌ఫీ మంత్రి దురేష్ శుభాకాంక్ష‌లు తెలిపారు జ‌న‌సేనానికి.