కాంగ్రెస్ సర్కార్ బేకార్ – ఆర్ఎస్పీ
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత
హైదరాబాద్ – రాష్ట్రంలో కొలువు తీరిన రేవంత్ రెడ్డి సర్కార్ పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. నిరుద్యోగులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
తెలంగాణలో గ్రూప్ -2, 3 పోస్టులను పెంచాలని , జీవో నెంబర్ 46 బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీఎఎస్సీ అభ్యర్థులు సన్నద్దం కావడం కోసం కొంత సమయం ఇవ్వాలని కోరారు ఆర్ఎస్పీ.
జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురుకుల బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. ఇప్పటికే ఎంపికైన 140 మంది పోలీస్ అభ్యర్థులను వెంటనే శిక్షణకు పంపించాలని స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ఇవాళ చేపట్టిన మహా ధర్నాకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.