NEWSANDHRA PRADESH

పోలీసులు పారా హుషార్

Share it with your family & friends

ప‌ని చేసే రోజులు వ‌చ్చాయి

అమ‌రావ‌తి – పోలీసుల‌కు ఇక నుంచి ఎలాంటి వ‌త్తిళ్లు అంటూ ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. కేబినెట్ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడతామ‌ని అన్నారు. ప్రధానంగా ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ‌డం, మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణాపై ఉక్కు పాదం మోపుతామ‌ని హెచ్చ‌రించారు. అంతే కాకుండా గ‌త వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో పోలీసులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డార‌ని పేర్కొన్నారు.

కానీ తాము వ‌చ్చాక కీల‌క మార్పులు తీసుకు వ‌స్తామ‌న్నారు హోం శాఖ మంత్రి. ప్ర‌ధానంగా గంజాయి విచ్చ‌ల‌విడిగా దొర‌క‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నామ‌ని , క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అన్ని శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో 100 రోజుల ప్లాన్ త‌యారు చేస్తామ‌ని చెప్పారు అనిత‌.

ఎవ‌రైనా స‌రే వైసీపీ పాల‌న‌తో త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని ముందుకు వ‌స్తే వారి త‌ర‌పున కేసులు న‌మోదు చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు హోం శాఖ మంత్రి.