NEWSANDHRA PRADESH

డిప్యూటీ సీఎంతో సీఎస్ భేటీ

Share it with your family & friends

మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశా

అమ‌రావ‌తి – రాష్ట్రంలో ప్ర‌భుత్వం మార‌డంతో కొత్త‌గా కొలువు తీరారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్. ఆయ‌న వ‌చ్చీ రావ‌డంతోనే ప్ర‌క్షాళ‌న స్టార్ట్ చేశారు. సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నారా చంద్ర‌బాబు నాయుడు దూకుడు పెంచారు. త‌న‌దైన స్టైల్ లో ప‌ని చేసుకుంటూ పోతున్నారు. ఈ త‌రుణంలో తిరుమ‌ల నుంచే ప్ర‌క్షాళ‌న ప్రారంభించారు.

ఇదిలా ఉండ‌గా తాజాగా రాష్ట్ర డిప్యూటీ సీఎంగా కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇవాళ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అనంత‌రం త‌న శాఖ‌ల‌కు సంబంధించి స‌మీక్ష చేప‌ట్టారు. అంత‌కు ముందు ఆయ‌న మ‌ర్యాద పూర్వ‌కంగా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా కొంత సేపు ప్ర‌ధాన అంశాల‌పై చ‌ర్చించారు.

ఇదే స‌మ‌యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను త‌న చాంబ‌ర్ లో సీఎస్ నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ భేటీ అయ్యారు. ప‌వ‌ర్ స్టార్ కు గుర్తుగా ఓ మొక్క‌ను బ‌హూక‌రించారు. ప్ర‌భుత్వాన్ని న‌డిపే ఏకైక వ్య‌క్తి సీఎస్. పేరుకే సీఎం, డిప్యూటీ సీఎంలు అయినా మొత్తం యంత్రాంగం అంతా త‌న చెప్పు చేతుల్లో ఉంటుంది. అందుకే సీఎస్ ల‌కు అంత ప్రాధాన్య‌త‌.