లోకేష్ ప్రజా దర్బార్ సక్సెస్
మంగళగిరిలో ప్రజలతో ముఖాముఖి
అమరావతి – ఏపీ మంత్రిగా కొలువు తీరిన నారా లోకేష్ పూర్తిగా మంగళగిరి నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఆయన ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా సంచలన ప్రకటన చేశారు.
నియోజకవర్గ ప్రజలకు తాను అందుబాటులో ఉంటానని, దీనిని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చి దిద్దుతానంటూ ప్రకటించారు. ఆ మేరకు ప్రజా దర్బార్ కు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వస్తున్న వినతులు స్వీకరిస్తున్నారు. అక్కడికక్కడే ఆయా శాఖల ఇంఛార్జ్ లకు చేరుస్తూ పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తున్నారు నారా లోకేష్.
ఇందులో భాగంగా ప్రజలు ప్రజా దర్బార్ కు పోటెత్తారు. తాజాగా మంత్రిని అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు కోట దేవకీ దేవి కలిశారు. విశాఖలో ఎగ్జిబిషన్ గడువు రెన్యువల్ కోసం వారం రోజులుగా తిరిగినా పట్టించు కోలేదని ఆవేదన చెందారు. ఈ విషయం లోకేష్ కు తెలిపారు. వెంటనే పర్మిషన్ ఇప్పించారు. దీంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు.