పేదలకు మెరుగైన వైద్యం
అందజేస్తామన్న కోమటిరెడ్డి
హైదరాబాద్ – పేదలకు మెరుగైన రీతిలో వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఆర్ అండ్ బీ , స్పెషాలిటీ హాస్పిటల్స్ పై సమీక్షలు చేస్తున్నామని చెప్పారు.
ప్రధానంగా పేదలు, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను పేదలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
తమ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందన్నారు. దశల వారీగా అమలు చేస్తూ వస్తున్నామని చెప్పారు. ఇప్పటికే తాము ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు స్కీమ్ కు అనూహ్యమైన రీతిలో ఆదరణ లభిస్తోందన్నారు.
ప్రతి రోజూ లక్షలాది మంది తమ తమ ప్రాంతాలకు బస్సులలో ప్రయాణం చేస్తున్నారని, ఇప్పుడు జనంతో ఆర్టీసీ కళ కళ లాడుతోందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రస్తుతం హాయిగా ఉన్నారని చెప్పారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.