NEWSTELANGANA

బొగ్గు బ్లాకుల వేలానికి శ్రీ‌కారం

Share it with your family & friends

ప్రారంభించ‌నున్న గంగాపురం

హైద‌రాబాద్ – అనుకున్న‌దే అయ్యింది. దేశంలోని ప్ర‌ధాన వ‌న‌రుల‌న్నింటిని గంప గుత్త‌గా బ‌డా బాబులు, బిలియ‌నీర్ల‌కు క‌ట్ట‌బెట్టేందుకు శ్రీ‌కారం చుట్టారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ. ఆయ‌న ముచ్చ‌ట‌గా మూడోసారి కొలువు తీరారు. ఇక తెలంగాణ‌కే మ‌ణిహారంగా పేరు పొందిన సింగ‌రేణిపై కన్నేసింది బీజేపీ స‌ర్కార్.

దానిని అదానీకి అప్ప‌గించే ప‌నిలో ప‌డింద‌ని బీఆర్ఎస్ ఆరోపించింది. ఇది ప‌క్క‌న పెడితే ఈనెల 21న 10వ రౌండ్ క‌మ‌ర్షియ‌ల్ బొగ్గు బ్లాకుల వేలాన్ని ప్రారంభించేందుకు ప్ర‌భుత్వం సిద్ద‌మైంది. ఈ రౌండ్ లో 60 బ్లాక్ లు వేలానికి రానున్నాయి.

ఈ మేర‌కు హైదరాబాద్‌లో వాణిజ్య బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. బొగ్గు మంత్రిత్వ శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ బ్లాక్‌లు వివిధ రాష్ట్రాలు , ప్రాంతాలలో వ్యూహాత్మకంగా ఉన్నాయని, ఇవి ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాయని , ఉపాధి కల్పనలో సహాయపడతాయని పేర్కొంది.

రాబోయే బొగ్గు గనులు బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ , పశ్చిమ బెంగాల్‌లో ఉన్నాయి. ఒడిశాలో 16 గనులు, ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ , మధ్యప్రదేశ్‌లలో 15 బొగ్గు గనులు వేలం వేయనున్నారు.

వాణిజ్య బొగ్గు బ్లాకుల వేలాన్ని 2020లో ప్రధానమంత్రి ప్రారంభించారు. అప్పటి నుండి, మంత్రిత్వ శాఖ గత తొమ్మిది రౌండ్లలో 107 బొగ్గు బ్లాకులను విజయవంతంగా వేలం వేసింది. ఇప్పటి వరకు దేశంలో 11 వాణిజ్య బొగ్గు బ్లాకులు ప్రారంభించబడ్డాయి.