NEWSANDHRA PRADESH

పేద‌ల‌ను మోసం చేసిన జ‌గ‌న్

Share it with your family & friends

నిప్పులు చెరిగిన పార్థ సార‌థి

అమ‌రావ‌తి – రాష్ట్ర గృహ నిర్మాణ‌, స‌మాచార శాఖ మంత్రి పార్థ‌సార‌థి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ‌త వైసీపీ స‌ర్కార్ మాయ మాట‌ల‌తో జ‌నాన్ని మోసం చేసింద‌ని ఆరోపించారు. గృహ నిర్మాణంలో పేద వారికి అన్యాయం చేసింద‌ని వాపోయారు.

టీడీపీ ప్రభుత్వ హయంలో 2 లక్షల నుంచి 2.50 వేలు వుంటే వాటిని వైసీపీ ప్రభుత్వం 1.80 వేలకు తగ్గించింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. 2014-19 మధ్యలో కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే, 4.4 లక్షల ఇళ్లను పూర్తిగా నిర్మించి ఇచ్చామ‌ని చెప్పారు పార్థ‌సార‌థి.

జ‌గ‌న్ మోహన్ రెడ్డి ప్యాల‌స్ నిర్మించు కోవ‌డంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టార‌ని , పేద‌ల‌కు ఇళ్లు కట్టించాల‌న్నది మ‌రిచి పోయాడ‌ని ఎద్దేవా చేశారు. అందుకే జ‌నం ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టార‌ని, త‌మ‌కు అంద‌లం ఎక్కించార‌ని స్ప‌ష్టం చేశారు.

త‌మ స‌ర్కార్ పేద‌ల‌కు , అర్హులైన వారికి నాణ్య‌మైన ఇళ్ల‌ను మంజూరు చేస్తామ‌ని తెలిపారు. పూర్తి పార‌ద‌ర్శ‌కంగా ప‌నులు చేప‌డ‌తామ‌న్నారు.