రుషి కొండ ప్యాలస్ పై షర్మిల కామెంట్
ప్రజల సొమ్ముతో అయితే విచారణ తప్పదు
విజయవాడ – ఏపీ పీసీసీ చీఫ్ , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. రుషి కొండ ప్యాలస్ కు సంబంధించి పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై మీ స్పందన ఏమిటి అన్న ప్రశ్నకు ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
రుషికొండ ప్యాలస్ అనేది ఎవరి కోసం కట్టారో వారికే తెలియాలని అన్నారు. ప్రజల సొమ్ముతో ఇంత పెద్ద భవనం దేని కోసమని ప్రశ్నించారు. ఒకవేళ జనానికి చెందిన సొమ్ముతో కట్టినట్లయితే వెంటనే విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఇది పూర్తిగా క్షమించరానిదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ఉపయోగించారనేది కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉందని లేకపోతే మరుగున పడి పోయే ప్రమాదం ఉందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. జగన్ రెడ్డి ఏకంగా రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేశాడంటూ ఆరోపించారు.