నీట్ పరీక్షను రద్దు చేయాలి
సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా నీట్ వ్యవహారం రోజు రోజుకు రాజుకుంటోంది. ప్రతిపక్షాలు మోడీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో పరీక్షా పత్రాలను అమ్ముకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి.
నీట్ 2024 పరీక్ష కోసం ఏకంగా దేశ వ్యాప్తంగా 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు బీహార్ లో పరీక్ష పేపర్ ను అమ్ముకున్నారంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై కేంద్రం విచారణకు ఆదేశించింది. ఇదే సమయంలో కొన్ని రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు ఎక్కువ మార్కులు రావడం, ర్యాంకులు సాధించడంపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో చర్చకు దారి తీసింది.
కాగా తాజాగా యుజీసీ – నెట్ 2024ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. దీనిపై భగ్గుమన్నారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా. వెంటనే నీట్ ను రద్దు చేయాలని, తిరిగి పరీక్ష చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.