సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్
ఆయన బ్రాండ్ కు విలువ లేదు
మహారాష్ట్ర – శివసేన యుబిటి జాతీయ నేత సంజయ్ రౌత్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఒకప్పుడు నరేంద్ర మోడీకి ఓ బ్రాండ్ ఉండేదని ఇప్పుడు అది లేకుండా పోయిందన్నారు. సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తుతం బ్రాండీగా మారి పోయాడంటూ ఎద్దేవా చేశారు.
ఇలా ఎంత కాలం ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తారంటూ ప్రశ్నించారు. జనం చూస్తూ ఊరుకోరని అన్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తగిన రీతిలో మోడీకి బుద్ది చెప్పారని అన్నారు. అయినా సోయి లేకుండా కేసులు నమోదు చేయడం, బెదిరింపులకు పాల్పడడం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
మోడీకి, ఆయన పరివారానికి, బీజేపీకి కాలం చెల్లిందని, ఏదో ఒక రోజు ప్రజలు రోడ్ల పైకి రాక తప్పదన్నారు. ఆరోజు పదవులు ఏవీ తమను రక్షించ లేవన్న నిజాన్ని గ్రహిస్తే మంచిదన్నారు సంజయ్ రౌత్. మరాఠాలో మరోసారి తమ వైపే ప్రజా తీర్పు ఉందని తేలి పోయిందన్నారు.