NEWSTELANGANA

తెలంగాణ అభివృద్దికి స‌హ‌క‌రించండి

Share it with your family & friends

గ‌త స‌ర్కార్ కంటే భిన్నంగా నిర్ణ‌యం

హైద‌రాబాద్ – సీఎంగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డి పాల‌నా ప‌రంగా త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తున్నారు. తాను పేద‌ల మ‌నిషిన‌ని చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ అంద‌రినీ విస్తు పోయేలా చేస్తున్నారు.

తాజాగా హైద‌రాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్స్ వ‌ద్ద 13 దేశాల ప్ర‌తినిధుల‌కు సీఎం ఆతిథ్యం ఇచ్చారు. ఇందులో అమెరికా, ఇరాన్, తుర్కియిస్తాన్ , యూఏఈ, యూకే, జ‌పాన్, థాయ్ లాండ్ , జ‌ర్మ‌నీ, శ్రీ‌లంక‌, బంగ్లాదేశ్ , ఆస్ట్రేలియా , ఫ్రాన్స్ , ఫిన్లాండ్ దేశాల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

ఈ సందర్భంగా వారికి శ్రీ రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. త‌మ‌ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ‘అభయహస్తం’ గొడుగు కింద అన్ని వర్గాల అభ్యున్నతికి నూతనంగా ఏర్పాటు అయిన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు.

మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర నేతల ఆశయాలను, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, పారదర్శకతతో ప‌ని చేస్తున్న‌ట్లు చెప్పారు. ఆరు హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమానికి త‌మ‌ ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. యువత భవిష్యత్తుకు, పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామ‌ని అన్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు.