నాడు శపథం నేడు ప్రవేశం
పంతం నెగ్గించుకున్న బాబు
అమరావతి – కాల గమనంలో ఎవరు ఎప్పుడు కింగ్ మేకర్ అవుతారో ఎవరూ చెప్పలేరు. చివరకు ఆ దేవుడు కూడా. నిండు సభలో తనను అవమానాలకు గురి చేయడమే కాకుండా తీవ్రమైన వ్యక్తిగత దూషణలకు పాల్పడినా తట్టుకుని నిలబడ్డారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. తాను తిరిగి ముఖ్యమంత్రిగా కొలువు తీరేంత వరకు శాసన సభలో అడుగు పెట్టబోనంటూ శపథం చేశారు. చివరకు తన మాటకు కట్టుబడి నిలబడ్డారు.
తాజాగా రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఏకంగా బంపర్ మెజారిటీ సాధించి ఔరా అనిపించేలా చేశారు నారా చంద్రబాబు నాయుడు. తాను ఎక్కడున్నా కింగేనంటూ చెప్పకనే చెప్పారు. జగన్ రెడ్డి పనిగట్టుకుని తనను జైలుపాలు చేసినా చివరకు బెయిల్ పై బయటకు వచ్చారు.
జూన్ 21న శుక్రవారం ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు. మళ్లీ సీఎంగానే సభకు వస్తానంటూ నవంబర్ 19, 2021లో శపథం చేశారు. ఇవాళ కొత్తగా కొలువు తీరిన కేబినెట్ తో పాటు 23 మంది మంత్రులు, శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆనాడు కంట తడి పెట్టుకును్నారు నారా చంద్రబాబు నాయుడు.తన భార్యను అవమానించారంటూ ఆవేదన చెందారు. ఇవాళ తన భార్య సహకారంతో అధికారంలోకి వచ్చారు. ఇది శాసన సభ కాదని కౌరవ సభ అంటూ సంచలన కామెంట్స్ కూడా చేశారు.