రిటైర్డ్ జడ్జిపై ఆర్ఎస్పీ గుస్సా
కేసీఆర్ ఇచ్చిన ఆన్సర్ కరెక్టే
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా తెలంగాణ ఎనర్జీ పాలసీపై విచారణ కమిషనర్ చైర్మన్ గా ఉన్న రిటైర్డ్ న్యాయమూర్తి ఎల్. నర్సింహారెడ్డి జారీ చేసిన నోటీసుపై భగ్గుమన్నారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు. తాను కూడా మాజీ సీఎం కేసీఆర్ చైర్మన్ కు రాసిన సుదీర్ఘ లేఖను చదివానని తెలిపారు. ఇందులో అభ్యంతరం వ్యక్తం చేసేందుకు గల కారణాలు ఏవీ కాన రాలేదని పేర్కొన్నారు ఆర్ఎస్పీ.
12 పేజీల ప్రతిస్పందనలో తెలంగాణను విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా మార్చడంలో కేసీఆర్ , సాంకేతిక నిపుణుల బృందం చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనని స్పష్టం చేశారు. దక్షిణ తెలంగాణలో కృష్ణా నది ఒడ్డున థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు నిర్ణయం తనను విశేషంగా ఆకట్టుకుందని తెలిపారు.
5000 మెగా వాట్ల లోటు అగాధం నుంచి 20,000 మెగా వాట్ల సామర్థ్యానికి గరిష్ట స్థాయికి చేరుకోవడం అంటే సామాన్యమైన విజయం కాదని పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ లాగా ఇంతటి భారీ దార్శనిక ప్రాజెక్టులను రికార్డు సమయంలో చేపట్టి పూర్తి చేయలేదన్నారు.
ఈ గొప్ప విధాన అద్భుతాలన్నింటినీ దేశ వ్యాప్తంగా వ్యాపార , పబ్లిక్ పాలసీ పాఠశాలల్లో కేస్ స్టడీలుగా బోధించాలని కోరారు.