చంపాలన్నోడికి స్పీకర్ పదవా
నిలదీసిన మాజీ సీఎం జగన్ రెడ్డి
అమరావతి – ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన టీడీపీ చీఫ్ , ఏపీ సీఎంగా కొలువు తీరిన నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి గూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా సీరియస్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది.
తన గురించి బహిరంగంగానే మాజీ మంత్రి, ప్రస్తుత అనకాపల్లి ఎమ్మెల్యే చింతకాయల అయన్నపాత్రుడు ఇంకా జగన్ రెడ్డి చని పోలేదని, చచ్చేంత దాకా కొట్టి చంపాలని చెప్పడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు జగన్ మోహన్ రెడ్డి.
జగన్ ఓడి పోయాడని , చంపాలని అన్నోడిపై కేసు నమోదు చేయకుండా ఏకంగా ఏపీ కూటమి సర్కార్ అత్యున్నతమైన స్పీకర్ పదవి కట్ట బెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఇలాంటి వాళ్లకు ఉన్నత పదవులు కట్టబెడితే శాసన సభ పరువు పోదా అని ప్రశ్నించారు జగన్ మోహన్ రెడ్డి.