జగన్ ప్రమాణానికి బాబు ఓకే
మంత్రుల తర్వాత మాజీ సీఎంకు
అమరావతి – ఏపీ మాజీ సీఎం , వైసీపీ బాస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై ఇవాళ విచారణ ఎదుర్కోనున్నారు. తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 164 స్థానాలను తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలతో కూడిన కూటమి గెలుపొందింది.
జూన్ 21న కొత్తగా కొలువు తీరింది ఏపీ శాషన సభలో. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది వైసీపీ. ఇదిలా ఉండగా ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు 23 మంది కేబినెట్ లో కొలువు తీరింది.
ప్రొటెం స్పీకర్ గా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పార్టీ చీఫ్ ఆయనకు ప్రొటెం స్పీకర్ గా పని చేసేందుకు ఛాన్స్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇవాళ సీఎంతో పాటు అంతా ప్రమాణ స్వీకారం చేశారు.
అంతకు ముందు మంత్రుల ప్రమాణం తర్వాత ఏపీ వైసీపీ బాస్ జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇవ్వాలని సీఎం నారా చంద్రబాబు నాయుడును కోరారు వైసీపీ తరపున ఎన్నికైన నేతలు. వారి అభ్యర్థనను టీడీపీ బాస్ ఓకే చెప్పారు. ఈ విషయాన్ని శాసన సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కు సమాచారం ఇచ్చారు. ఆయన కూడా సరేనని అనడంతో లైన్ క్లియర్ అయ్యింది.