జూన్ 22న పౌర్ణమి గరుడసేవ
వెల్లడించిన టీటీడీ ఈవో
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి కార్య నిర్వహణ అధికారి జె శ్యామలా రావు కీలక ప్రకటన చేశారు. జూన్ 22న శనివారం పౌర్ణమి రానుంది. దీనిని పురస్కరించుకుని కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భావించే తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ సేవ జరగనుందని వెల్లడించారు ఈవో జె. శ్యామలా రావు.
ప్రతి నెలా పౌర్ణమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంలో సిబ్బంది, శ్రీవారి సేవకులు నిమగ్నం అయ్యారు. ఇదిలా ఉండగా ప్రతి నెలా పౌర్ణమి రోజు టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తూ వస్తున్న విషయం విదిమే.
ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ ఉప కార్య నిర్వహణ అధికారి వీర బ్రహ్మం స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు తిరుమలకు. ఈ మేరకు సహాయక చర్యలు చేపట్టడంపై ఈవో జె శ్యామలా రావు ఫోకస్ పెట్టారు.