నిజం గెలిచింది..ప్రజాస్వామ్యం నిలిచింది
ప్రజలకు నారా భువనేశ్వరి ప్రమాణం
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నిండు సభలో ప్రమాణ స్వీకారం చేయడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆయన సతీమణి నారా భువనేశ్వరి. ఆమె తాజాగా జరిగిన ఎన్నికల్లో తన భర్తకు అండగా నిలిచారు. కేసులు నమోదు చేసినా, భర్తను జైలు పాలు చేసినా ఎక్కడా తగ్గలేదు. ధైర్యంగా ఎదుర్కొన్నారు. తన గురించి అప్పటి శాసన సభ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసినా కంట తడి పెట్టలేదు.
తన భర్తను అవమానాలకు గురి చేసినా ఎక్కడా తల వంచ లేదన్నారు. అనరాని మాటలు అన్నా ఓర్చుకున్నారని , ఇవాళ సగర్వంగా తల ఎత్తుకుని నిలబడ్డారని జూన్ 21న శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారని ఇది నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచిందని స్పష్టం చేశారు నారా భువనేశ్వరి.
నిజం గెలిచిందని, ప్రజాస్వామ్యం నిలిచిందన్నారు . ఈ సందర్బంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి అపూర్వమైన విజయం కల్పించినందుకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.