నీట్ పరీక్షను రద్దు చేయాలి
మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్
బీహార్ – రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్ 2024 పరీక్ష కుంభకోణంపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నీట్ పై శుక్రవారం ఆయన స్పందించారు. శుక్రవారం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు.
నీట్ పరీక్షను రద్దు చేయాలన్నది ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి వాదన. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. నీట్ పరీక్షను రద్దు చేయక పోతే దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు తేజస్వి యాదవ్.
దేశంలో అధికారంలో ఉన్నది తాము కాదని బీజేపీ ఉందన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న వాళ్లు ముందు తామేమిటో తెలుసుకుంటే మంచిదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ మీ గుప్పిట్లోనే ఉన్నాయని వెంటనే విచారణ జరిపించాలని కోరారు .
సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దమ్ముంటే ఎలాంటి విచారణకైనా సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.