అమరావతి ప్రజల సామూహిక చిహ్నం
సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని సందర్శించిన ఆయన వెంటనే ఆ మట్టికి నమస్కరించారు. ఈ సందర్బంగా అమరావతి ప్రపంచంలోనే టాప్ లో నిలిచేలా చేస్తానని ప్రకటించారు. అంత వరకు తాను నిద్రో పోనంటూ ప్రకటించారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా తాను ఊరుకునే ప్రసక్తి లేదన్నారు.
అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాదన్నారు. అది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలకు సామూహిక చిహ్నమని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. గత సర్కార్ అమరావతి పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించిందని ఆరోపించారు.
రైతులను తీవ్ర మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు. రాజధానిని నాశనం చేసేందుకు ప్రయత్నం చేసిందన్నారు. ప్రజలను , తమను తీవ్ర బాధ పడేలా చేసిందన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ నా మనసు ప్రశాంతంగా ఉందన్నారు. ఇక అమరావతి పనులు పునః ప్రారంభం అవుతాయని ఇక రాజధానికి ఢోకా లేదన్నారు సీఎం.