రుణ మాఫీకి లైన్ క్లియర్
ప్రకటించిన సీఎం రేవంత్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటించిన రూ. 2 లక్షల రుణ మాఫీకి లైన్ క్లియర్ చేస్తూ కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.
ఆయన మీడియాతో మాట్లాడారు. తన జీవితంలో మరిచి పోలేని రోజుగా ఇవాళ మిగిలి పోతుందన్నారు. మే 6, 2022 రోజు వరంగల్ వేదికగా లక్షలాది మంది రైతులకు ఏఐసీసీ మాజీ చీఫ్, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఏక కాలంలో రుణ మాఫీ చేస్తున్నామని చెప్పారు.
సమావేశమైన మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని నిరూపించుకున్నామని అన్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆనాడు సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని గుర్తు చేశారు.
రైతుల రుణ మాఫీకి సంబంధించి విధి విధానాలను తయారు చేయడంలో కొంత ఆలస్యం జరిగిందని పేర్కొన్నారు.