రుణ మాఫీ ప్రకటనతో జన్మ ధన్యం
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతు రుణ మాఫీకి సంబంధించి కీలక ప్రకటన చేయడం తన జీవితంలో మరిచి పోలేని రోజుగా తన జీవితంలో నిలిచి పోతుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర సచివాలయంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుల కష్టం ఏమిటో తనకు బాగా తెలుసన్నారు. ఎందుకంటే తాను రైతు బిడ్డను కాబట్టి. మా నాయిన వ్యవసాయం చేసిండు. నేను కూడా పొలం దున్నాను. అన్నదాతలు నిత్యం మట్టిని నమ్ముకుని చివరి దాకా బతుకుతారని , అందుకే రైతులందరికీ సంబంధించి రుణాలను మాఫీ చేయడంతో తన జన్మ ధన్యమైందని చెప్పారు ఎనుముల రేవంత్ రెడ్డి.
ఇదిలా ఉండగా మంత్రివర్గం ఏక కాలంలో రుణాలు మాఫీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. వ్యవసాయం దండగ అంటూ కొందరు చేసిన కామెంట్స్ ను ఆయన గుర్తు చేశారు. తాము పండుగ చేస్తామని అన్నారు.
రుణ మాఫీకి సంబంధించి విధి విధానాలను ప్రకటిస్తామన్నారు. 12 డిసెంబర్ 2018 నుండి 9 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని స్పష్టం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.