స్టార్టప్ ల పనితీరు భేష్ – పీఎం
అంకురాలకు కేంద్రం చేయూత
జమ్మూ కాశ్మీర్ – దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము దేశంలో కొలువు తీరిన తర్వాత అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పాలన సాగిస్తున్నామని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ లో పర్యటించిన పీఎం మీడియాతో మాట్లాడారు.
తన మొదటి ప్రాధాన్యత అంకురాలకు అంకురార్పణ చేయడంపై ఎక్కువగా ఫోకస్ పెడతానని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా జమ్మూ కాశ్మీర్ కు చెందిన యువతీ యువకులు స్టార్టప్ లను ప్రారంభించడం, వేలాది మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమని కొనియాడారు.
ప్రతి ఆలోచన చిన్న గది నుండే ప్రారంభం అవుతుందని , ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్న కంపెనీలన్నీ ఒకనాడు అంకురాలేనని గుర్తు చేశారు ప్రధానమంత్రి మోడీ. కేంద్ర సర్కార్ కేవలం స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు , ఔత్సాహికులను వెన్ను తట్టి ముందుకు నడిపించేందుకు ప్రత్యేకంగా నిధులను కేటాయించడం జరిగిందని చెప్పారు.
వీటి ద్వారా ఎన్నో ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయని, ఇదే స్పూర్తితో ముందుకు కదలాలని పిలుపునిచ్చారు పీఎం.