NEWSNATIONAL

ఢిల్లీ సీఎంకు బిగ్ షాక్

Share it with your family & friends

బెయిల్ పై కోర్టు స్టే

న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అర‌వింద్ కేజ్రీవాల్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ , ఈడీ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

దీంతో తిరిగి బెయిల్ ఇవ్వ‌డంపై కుద‌రదంటూ స్టే ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. ఇదిలా ఉండ‌గా ఇదంతా కావాల‌ని మోడీ, అమిత్ షా చేస్తున్న క‌క్ష సాధింపు చ‌ర్య త‌ప్ప మ‌రోటి కాద‌ని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.

ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టార‌ని అన్నారు. ప‌ని చేసే వారికి ప‌ట్టం క‌డ‌తారని అది తెలుసు కోకుండా రాచ‌రిక పాల‌న సాగిస్తామంటే ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజ‌య్ ఆజాద్ సింగ్.

ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారంటూ నిప్పులు చెరిగారు. ఆప్ ప్ర‌భుత్వాన్ని కూల్చాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కానీ వారి ఆట‌లు చెల్ల‌వ‌న్నారు.