ఆత్మను వెలిగించే ధూపం దైవం
సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ , ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇతర అధికారుల కంటే ఆమెకు ఎక్కువగా జనంలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికి కారణం ఆమె చిన్నతనంలోనే సివిల్స్ కు ఎంపిక కావడం.
ముందు నుంచీ ప్రజల మధ్యన ఉండటం, వారితో కలిసి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయడంతో మరింత ఆదరణ పెరిగేలా చేసింది. అందరూ స్మితా సబర్వాల్ ను పీపుల్స్ ఆఫీసర్ అని పిలుచుకుంటారు.
జిందగీ అన్నది ఒక్కటే సారి వస్తుందని, దీనిని సాధ్యమైనంత మేర ప్రతి క్షణం ఆస్వాదిస్తూ ముందుకు వెళ్లాలనేది స్మితా సబర్వాల్ అభిమతం. ఓ వైపు వృత్తి పరంగా విధులు నిర్వహిస్తూనే తనకు ఖాళీ సమయంలో ప్రకృతిని ఆస్వాదించడం, పుస్తకాలను చదవడం చేస్తూ వస్తున్నారు.
ఈ మధ్యన చారిత్రిక స్థలాలు, దర్శనీయ ప్రాంతాలు, ఆలయాలను దర్శిస్తున్నారు . తాజాగా శనివారం పౌర్ణమి పండుగను పురస్కరించుకుని దీపాలను వెలిగించారు స్మితా సబర్వాల్.