NEWSANDHRA PRADESH

నీట్ నిర్వాకం ష‌ర్మిల ఆగ్ర‌హం

Share it with your family & friends

వెంట‌నే ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయాలి

అమ‌రావ‌తి – దేశంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో పూర్తిగా ఫెయిల్ అయ్యిందంటూ ఆరోపించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. శ‌నివారం ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. నీట్ ప‌రీక్ష‌లో చోటు చేసుకున్న అక్ర‌మాల‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. ఇందుకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాల‌ని కోరారు.

నీట్ ప‌రీక్ష కోసం దేశ వ్యాప్తంగా 25 ల‌క్ష‌ల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యార‌ని, 1500 మందికి ఏక కాలంలో ర్యాంకులు ఎలా వ‌స్తాయ‌ని ప్ర‌శ్నించారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి, తల్లి తండ్రులను మానసిక వేదనకు గురి చేసిన నీట్ పేపర్ లీక్ స్కామ్ పై బీజేపీ స‌ర్కార్ మౌనంగా ఉండ‌డం, పీఎం స్పందించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

దీని వెనక ఎవరు ఉన్నారో, ఎవరిని రక్షించే ప్రయత్నం జరుగుతోందో యావత్ దేశం కలవరంతో గమనిస్తోందన్నారు, ఎన్డీయే సర్కారు వైఖరిని ఏకకంఠంతో ఖండిస్తోందన్నారు.