అయ్యన్న పాత్రుడు ఆదర్శ ప్రాయుడు
ప్రశంసించిన హోం శాఖ మంత్రి అనిత
అమరావతి – ఏపీ శాసన సభ సభాపతిగా ఎన్నికైన సీనియర్ టీడీపీ నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడును అభినందనలతో ముంచెత్తారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. శనివారం అసెంబ్లీలో ఆమె ప్రసంగించారు. అయ్యన్న పాత్రుడు తనకు ఆదర్శ ప్రాయుడని పేర్కొన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాను టీచర్ గా పని చేశానని గుర్తు చేశారు.
చింతకాయల అయ్యన్న పాత్రుడు రాజకీయ పరంగా ఎంతో అనుభవం కలిగిన నాయకుడు అని కొనియాడారు. ఆయన స్పీకర్ గా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. శాసన సభ హుందా తనం మరింత పెంచేలా చేస్తారని , ఆ నమ్మకం తనకు ఉందన్నారు వంగలపూడి అనిత.
ఇదే సమయంలో ఇక్కడ ప్రతిపక్షలేక పోవడం దారుణమన్నారు. కనీసం శాసన సభా సంప్రదాయం పాటించక పోవడం బాధ కలిగించిందన్నారు. తాను అయ్యన్న పాత్రుడిని అధ్యక్షా అని సంబోధించడం మరింత సంతోషం కలిగించిందని చెప్పారు రాష్ట్ర హోం శాఖ.