వైసీపీ ఎమ్మెల్యేలు పారిపోతే ఎలా..?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెటైర్
అమరావతి – జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం అసెంబ్లీలో నూతన స్పీకర్ గా ఎన్నికయ్యారు నర్సీంపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఈ సందర్బంగా ప్రసంగించారు పవన్ కళ్యాణ్.
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, వాటిని అర్థం చేసుకోకుండా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. అపారమైన రాజకీయ అనుభవం కలిగిన అరుదైన నాయకుడు అయ్యన్న పాత్రుడు అని కొనియాడారు .
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది అత్యంత ముఖ్యమని, ప్రజా పక్షం వహించాల్సిన వాళ్లు ఇవాళ స్పీకర్ గా కొలువు తీరిన సమయంలో వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడం దారుణంగా ఉందన్నారు. ఇది అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
ఓటమిని ఎదుర్కొనే ధైర్యం లేక పోవడం విస్తు పోయేలా చేసిందన్నారు. విచిత్రం ఏమిటంటే పారి పోవడం తనను ఆశ్చర్య పోయేలా చేసిందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. విజయాన్ని తీసుకున్నారని కానీ అపజయాన్ని అంగీకరించే మనస్తత్వం జగన్ రెడ్డికి లేక పోవడం బాధ కలిగించిందన్నారు .