NEWSANDHRA PRADESH

కొలువు తీరిన అయ్య‌న్న

Share it with your family & friends

పాత్రుడు వెరీ వెరీ స్పెష‌ల్

అమ‌రావ‌తి – ఏపీ రాజ‌కీయాల‌లో అరుదైన పాత్ర పోషిస్తూ వ‌చ్చారు ఉత్త‌రాంధ్ర‌కు చెందిన బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన న‌ర్సింప‌ట్నం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు. శ‌నివారం అసెంబ్లీలో నూత‌న స్పీక‌ర్ గా కొలువు తీరారు. ఆయ‌న‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు.

ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒక‌సారి ఎంపీగా ఉన్నారు. నాలుగు సార్లు మంత్రిగా ప‌ని చేశారు. 40 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు.

1983లో సుడిగాలిలా వ‌చ్చిన దివంగ‌త ఎన్టీఆర్ నాయ‌క‌త్వంలో ప‌ని చేశారు. ఆయ‌న పిలుపుతో 25 ఏళ్ల ప్రాయంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. త‌న‌కు ఏ ప‌ద‌వి ఇచ్చినా ఆ ప‌ద‌వికి వ‌న్నె తెచ్చేలా చేశారు. ఆయ‌న‌కు ఇప్పుడు 66 ఏళ్లు. ఇప్ప‌టికీ పార్టీ ప‌రంగా అయ్య‌న్న పాత్రుడు ఫైర్ బ్రాండ్ గా పేరు పొందారు.

నీతి, నిజాయతీ, నిబద్దతను పుణికిపుచ్చుకొని రాజకీయాలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న నాయకుడిగా చెలామ‌ణి అవుతూ వ‌చ్చారు.. అయ్యన్న గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయ్యన్నపై 23 కేసులు పెట్టినా రాజీలేని పోరాటం చేశారు. చివ‌ర‌కు స్పీక‌ర్ గా ఎన్నిక‌య్యారు.