చంద్రబాబుతో పోటీ పడక తప్పదు
రోజుకు 18 గంటలు పని చేయాలి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్లు పై బడినా ఇంకా యువకుడిలాగే పని చేస్తూ వస్తున్నారు . తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ మెజారిటీని సాధించింది. పవర్ లోకి వచ్చింది.
ఉమ్మడి ఏపీకి సీఎంగా పని చేశారు చంద్రబాబు నాయుడు. శనివారం హైదరాబాద్ లోని బాబు బావమరిది , ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చైర్మన్ గా ఉన్న బసవ తారకం ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలకృష్ణను సినిమా రంగానికి వదిలి వేయాలని అన్నారు. అల్లుళ్లకు రాజకీయం, సామాజిక రంగాలను అప్పగించాలని సూచించారు. ఇదిలా ఉండగా గతంలో 12 గంటలు పని చేస్తే సరి పోతుందని అనుకునే వాడినని అన్నారు.
కానీ దానిని మార్చు కోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. చంద్రబాబు 18 గంటలు పని చేస్తున్నాడని తాను కూడా ఆయనతో పోటీ పడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.