లోకేష్ ప్రజా దర్బార్ సూపర్
మంత్రి అయినా ముఖాముఖి ఆగదు
అమరావతి – ఏపీ ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. తాను మంగళగిరి నియోజకవర్గంలో ప్రారంభించాన ప్రజా దర్బార్ ఆగదని స్పష్టం చేశారు. ప్రజలు ఈ నియోజకవర్గం నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి తండోప తండాలుగా తన వద్దకు వస్తున్నారని చెప్పారు.
తాను ప్రారంభించిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. వివిధ రకాల సమస్యలతో వస్తున్న బాధితులకు తాను భరోసా కల్పించడంతో పాటు ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
విచిత్రం ఏమిటంటే తెల్లవారుజాము నుంచే ఉండవల్లి లోని తమ నివాసం వద్ద పెద్దఎత్తున జనం బారులు తీరుతున్నారని పేర్కొన్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా తనను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని తెలిపారు నారా లోకేష్.