దర్శనం..లడ్డూ ధరల్లో మార్పు లేదు
ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం , లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది. టీటీడీ ధరలను సవరించిందని పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు టీటీడీ ఈవో జె. శ్యామలా రావు.
తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ. 50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
పలు సామాజిక మాధ్యమాలలో శ్రీవారి లడ్డు ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలును టీటీడీ సవరించినట్లు వస్తూన్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. భక్తులు ఇలాంటి వార్తలను నమ్మవద్దని కోరారు.
అయితే ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం దళారులను నమ్మి మోస పోవద్దని కోరారు. టీటీడీ దర్శనాలు, సేవలకు సంబంధించి ప్రత్యేకంగా అధికారికంగా ప్రకటన చేస్తుందని తెలిపారు.